కామారెడ్డి జిల్లా బాన్సువాడలో రాష్ట్ర సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి జన్మదిన వేడుకలను నిర్వహించారు. పట్టణంలోని 11వ వార్డు గూడెంగల్లీలోని రెండు పడక గదుల లబ్ధిదారులు మంద సాయవ్వ ఇంట్లో ఘనంగా జరుపుకున్నారు. అక్కడ సభాపతి కేక్ కట్ చేసి అల్పాహారం భుజించారు.
పోచారం జన్మదిన వేడుకలను... తన ఇంట్లో జరుపుకున్నందుకు మంద సాయవ్వ సంతోషించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శరత్, ఆర్డీఓ రాజేశ్వర్, ఎమ్మార్వో గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి : రాష్ట్ర ప్రజలపై భారం.. విద్యుత్ ఛార్జీలు పెంపు