కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని తెరాస కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి.. ప్రాంతీయ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మోహన్ నాయక్ మున్సిపల్ ఛైర్మన్ గంగాధర్, బాన్సువాడ నియోజకవర్గ తెరాస నాయకులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.