కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గౌతమ్ మోడల్ పాఠశాలలో ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్నారని ఏబీవీపి నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన మండల విద్యాధికారి ఎల్లయ్య పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేపట్టారు.
ఈ తనిఖీల్లో మూడు గదుల్లో పుస్తకాలు విక్రయించడం గుర్తించిన ఎల్లయ్య.. ఆ గదులను సీజ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్న గౌతమ్ మోడల్ పాఠశాల యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.