కామారెడ్డి జిల్లా కేంద్రంలో వ్యాపారులు ఇవాళ స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటించారు. జిల్లా కేంద్రంలోని దుకాణాలన్నీ మూసివేశారు. నేటి నుంచి ఈ నెల 30 వరకు మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే వ్యాపార లావాదేవీలు కొనసాగనున్నాయి.
కొవిడ్ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నందున ఆంక్షలు అమలు చేస్తున్నట్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధి ఎల్లంకి శ్రీనివాస్ తెలిపారు. ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. వైరస్ కట్టడికి సాయపడాలని సూచించారు.
ఇదీ చూడండి: కొవిడ్ నుంచి కాపాడాల్సిన బాధ్యత కేంద్రానిదే : తలసాని