Second dose vaccine to dead man : కామారెడ్డి జిల్లాలో కరోనా సోకి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి... రెండో డోస్ టీకా తీసుకున్నట్లుగా అధికారులు మెసేజ్ పంపించారు. కోవిన్ పోర్టల్ నుంచి సర్టిఫికెట్ డౌన్ లోడ్ అవ్వడంతో విషయం బయటకు వచ్చింది.
![Second dose vaccine to dead man, deceased vaccination](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14311774_vacci-2.jpg)
తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామానికి చెందిన కొడిశాల రాజశేఖర్.... గతేడాది ఏప్రిల్ 27ని కరోనాతో చికిత్స పొందుతూ మృతిచెందాడు. గత ఏప్రిల్ 10 న రాజశేఖర్ మొదటి డోస్ తీసుకున్నాడు. టీకా తీసుకున్న 10 రోజులకు కరోనా బారిన పడ్డారు. హైదరాబాద్ మదీనగూడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
రాజశేఖర్ మృతి చెందినట్టుగా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డెత్ సర్టిఫికెట్ కూడా జారీ చేసింది. కానీ ఇప్పుడు సెకండ్ డోస్ టీకా విజయవంతంగా పూర్తయినట్టుగా మెసేజ్ వచ్చింది. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు కోవిన్ పోర్టల్లో ధ్రువపత్రాన్ని డౌన్లోడ్ చేశారు. కాగా 9 నెలల క్రితం చనిపోయిన వ్యక్తికి... టీకా ఇచ్చినట్లు మెసేజ్ రావడంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వ్యాక్సినేషన్ టార్గెట్ రీచ్ కావడం కోసమే వైద్యాధికారులు ఇలా ఎంట్రీ చేశారా? అని వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
![Second dose vaccine to dead man, deceased vaccination](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-nzb-07-28-chanipoina-vyakthiki-vaccine-vesinattuga-online-entry-av-ts10142_28012022224307_2801f_1643389987_493.jpg)
ఇదీ చదవండి: 'తల్లిదండ్రులకు టీకాతో పిల్లలకూ రక్షణ..'