ETV Bharat / state

Revanth reddy on paddy procurement: 'ధాన్యం కొనకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉరి తప్పదు'

రైతులపై కక్ష సాధింపులో భాగంగానే సీఎం కేసీఆర్​.. ధాన్యం కొనుగోలు చేయడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి(Revanth reddy on paddy procurement) ఆరోపించారు. నూతన సాగు చట్టాలు తెరాస పోరాటంతోనే రద్దయితే.. రాష్ట్రంలో ధాన్యం ఎందుకు కొనడం లేదని ప్రశ్నించారు. మద్యం టెండర్ల ద్వారా వచ్చిన డబ్బుతోనైనా ధాన్యం కొనాలని డిమాండ్ చేశారు. కల్లాల్లో కాంగ్రెస్​ కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లా బస్వాపూర్​లో రేవంత్​ రెడ్డి పర్యటించారు.

revanth reddy
కామారెడ్డి జిల్లాలో రేవంత్​ రెడ్డి పర్యటన
author img

By

Published : Nov 19, 2021, 6:03 PM IST

రైతుల్లో ధైర్యం నింపేందుకే కొనుగోలు కేంద్రాల పరిశీలన: రేవంత్‌రెడ్డి

కల్లాల్లో వడ్లు కొనకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులతో చెలగాటమాడుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి(Revanth reddy on paddy procurement) విమర్శించారు. ప్రస్తుత సీజన్‌ వడ్లు కొనుగోలు చేసి అన్నదాతలను ఆదుకోవాల్సిన కేసీఆర్‌.. వచ్చే యాసంగిలో పంటను కేంద్ర కొనాలనడం విడ్డూరంగా ఉందన్నారు. 'కల్లాల్లోకి కాంగ్రెస్‌' కార్యక్రమంలో భాగంగా సీనియర్‌ నేత షబ్బీర్‌ అలీతో కలిసి కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం బస్వాపూర్‌లో రేవంత్​ రెడ్డి(Revanth reddy on paddy procurement) పర్యటించారు. వరికుప్పల వద్దకు వెళ్లిన రేవంత్‌.. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఉరి తప్పదు

సాగుదారులతో పెట్టుకున్నవారు బాగుడపడినట్లు చరిత్రలో లేదని రేవంత్‌(Revanth reddy on paddy procurement) దుయ్యబట్టారు. నెలరోజులుగా ధాన్యం కొనకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. వర్షాలకు ధాన్యం తడిసి మొలకెత్తుతోందని రైతులు రేవంత్‌కు విన్నవించారు. ఆరుగాలం కష్టించి పండించిన పంట నేలపాలవుతోందని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రైతుల చేతిలో ఉరి తప్పదని రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు.

ధాన్యం అమ్ముకునేందుకు రైతులు వరి కుప్పల పైనే పడుకుని ఎదురుచూసే పరిస్థితి నెలకొంది. రైతుల గురించి ఆలోచించకుండా ధర్నాల పేరిట కాలయాపన చేస్తున్నారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంట.. కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో వర్షానికి తడిసిపోతోంది. ప్రతి గింజా నేనే కొంటా అని చెప్పిన కేసీఆర్​.. ఇప్పుడు కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ధాన్యం కొనకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉరి తప్పదు. పార్లమెంటులో ప్రధాన మంత్రిని నిలదీసి వరి పంటను కొనేలా చేస్తాం. పంట నీటిపాలై రైతులు దుఃఖంలో ఉన్నారు. రైతుల్లో ధైర్యం నింపేందుకే కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తున్నాం. వారి సమస్యలను తెలుసుకునేందుకు కల్లాల్లో కాంగ్రెస్​ పేరిట పర్యటిస్తున్నాం. -రేవంత్​ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు

ఆ డబ్బుతోనైనా కొనాలి

మార్కెట్ ఇంట్రవెన్సింగ్న్ స్కీమ్​ కింద మొలకెత్తిన వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రేవంత్(Revanth reddy on paddy procurement) డిమాండ్​ చేశారు. తెలంగాణ ఉద్యమంలో జాయింట్ యాక్షన్ కమిటీ ఉండేదని.. ఇప్పుడు రాష్ట్రంలో కేసీఆర్​, బండి సంజయ్​లు డ్రామా యాక్షన్ కమిటీ మొదలెట్టారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఫాం హౌస్​లో కూర్చొని పరిపాలన చేయడం వల్లే రైతులకు ఈ దుస్థితి పట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన సాగు చట్టాలు తెరాస పోరాటంతోనే రద్దయితే.. రాష్ట్రంలో ధాన్యం ఎందుకు కొనడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మద్యం టెండర్ల ద్వారా వచ్చిన డబ్బుతోనైనా ధాన్యం కొనాలని డిమాండ్ చేశారు.

కక్ష సాధిస్తోంది

నూతన సాగు చట్టాలు వెనక్కి తీసుకోవడం కేవలం రైతుల విజయం మాత్రమేనని రేవంత్​(Revanth reddy on paddy procurement) పేర్కొన్నారు. యూపీ ఎన్నికల కోసమే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ప్రాణాలు పోయిన రైతు కుటుంబాలకు మోదీ క్షమాపణ చెప్పి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరిధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రైతులపై కక్ష సాధింపులో భాగంగానే కేసీఆర్ ధాన్యం కొనడం లేదని ఆరోపించారు.

కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అకాల వర్షాలతో రైతులు కల్లాల వద్ద ఇబ్బందులకు గురవుతున్నారని రేవంత్​(Revanth reddy on paddy procurement) ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని.. కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాడుతుందని హామీ ఇచ్చారు. రైతులకు భరోసా ఇవ్వడానికి కల్లాల్లోకి కాంగ్రెస్ పేరిట ఈ నెల 29 వరకు తెలంగాణ రాష్ట్రమంతటా పర్యటిస్తామని రేవంత్​ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: 'సాగు చట్టాలు ఇప్పుడే రద్దైనట్టు కాదు.. ఇంకా చాలా ఉంది!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.