ETV Bharat / state

REVANTH REDDY: 'రైతులకు కావాల్సింది రైతు బీమా కాదు.. పంట బీమా' - నష్టపోయిన పంటను పరిశీలించిన రేవంత్‌రెడ్డి

Revanth Reddy Observation Rain Damaged Crops: ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఇప్పుడు అత్యధికంగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. రైతులకు కావాల్సింది రైతు బీమా కాదని.. పంట బీమా అని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాలోని పొందుర్తిలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు.

revanth reddy
revanth reddy
author img

By

Published : Apr 26, 2023, 5:12 PM IST

Revanth Reddy Observation Rain Damaged Crops: రాష్ట్రంలోని రైతులకు కావాల్సింది రైతు బీమా కాదు.. పంట బీమానని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి తెలిపారు. ఈ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనలో రైతులు ఏ ఒక్క రోజు కూడా సంతోషంగా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్‌లోని నిరుద్యోగ దీక్ష కోసం వెళుతూ మార్గమధ్యలో కామారెడ్డి జిల్లాలోని పొందుర్తిలో అకాల వర్షాలకు దెబ్బ తిన్న పంటలను పరిశీలించి.. రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

తెలంగాణ మోడల్‌ అంటే రైతుల ఆత్మహత్యాలా అంటూ రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే అత్యధికంగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. రైతుల విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం.. పూర్తిగా విఫలమైందని విమర్శలు గుప్పించారు. ఈ నెపాన్ని కేసీఆర్ కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం కొంటేనే కొంటామంటే.. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇక్కడుందని ప్రశ్నించారు. రైతులు ఓట్లు వేస్తేనే కదా.. మీరు ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్నారన్నారు. రైతుల ఓట్లతో గద్దెనెక్కి.. రైతుల గుండెలపై తన్నే ప్రయత్నం చేస్తున్నారని కేసీఆర్‌పై మండిపడ్డారు.

Rain Damaged Crops In Kamareddy: అధికారిక లెక్కల ప్రకారం చూస్తే ప్రతి సంవత్సరం తెలంగాణలో 1200 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రం సిద్దించాక రెండు లక్షల మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆందోళన చెందారు. ఈ ఆత్మహత్యలకు సీఎం కేసీఆర్‌నే ప్రధాన కారకుడు.. రైతు హంతకుడు అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి.. రైతులను ఆదుకుందని తెలిపారు. వడగళ్ల వానతో రైతులు పూర్తిగా నష్టపోయారని.. కామారెడ్డిలోని పొందుర్తి ప్రాంతంలోనే వెయ్యి ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్‌ నేతలు దావత్‌లకే పరిమితం: రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టాన్ని అంచనా వేసి.. ఎకరాకు రూ. 20 వేలు పరిహారం ఇవ్వాలని.. అలాగే మామిడి తోటలకు ఎకరాకు రూ. 50 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తడిచిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనాలని పేర్కొన్నారు. పంట నష్టం పరిశీలించకుండా.. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆత్మీయ సమ్మేళనాలు పేరుతో దావత్‌లు చేసుకుంటున్నారని మండిపడ్డారు. శాసన సభ్యులు, ఐఏఎస్‌ అధికారులను క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేయడానికి పంపించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై పోరాడతామని.. కాంగ్రెస్‌ నేతలు పంట నష్టం వచ్చిన జిల్లాల్లో పర్యటించి నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.