కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో మాతాశిశు సంక్షేమ ఆసుపత్రిలో నూతనంగా 20 మందికి స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి నియామక పత్రాలను అందజేశారు. రాష్ట్రంలో 7 మాతాశిశు సంక్షేమ ఆసుపత్రులు మంజూరు చేయగా.. అందులో మొట్టమొదటిగా పూర్తి చేసుకున్న ఆసుపత్రి ఇదేనని స్పీకర్ అన్నారు. పరికరాలు వచ్చాక అధికారికంగా ప్రారంభోత్సవం చేస్తామన్నారు.

ఆపరేషన్, లేబోరేటరీ రూమ్ పరికరాలు కొన్ని కావలసిఉందన్నారు. ముఖ్యమంత్రి ముందు చూపుతో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టారని పేర్కొన్నారు. బాన్సువాడ రహదారుల అభివృద్ధికి 300 కోట్లు కేటాయించారని.. తద్వారా రాకపోకలు పెరిగాయన్నారు. ఆసుపత్రికి వచ్చేవారికి మంచి వైద్యం అందించి.. క్షేమంగా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు. కేసీఆర్ కిట్ లాంటి పథకాల వల్ల గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యం మెరుగుపడిందన్నారు.
ఇదీ చూడండి: పోడు రైతుల బతుకును బజారుకీడ్చొద్దు : కోదండరాం