ETV Bharat / state

పూజకు వాడిన నీటిని చెట్లకు పోసిందని మూకుమ్మడి దాడి - Attack on a woman with a pretense of magic

ఆమె రోజు మాదిరిగానే దేవుడికి పూజ చేసింది. పూజకు వాడిన నీటిని చెట్లకు పోసింది. అంతే..మంత్రాలు చేస్తున్నావని కాలనీ వాసులు ఆమెపై తీవ్రంగా దాడి చేశారు. ఆమెకు తీవ్ర గాయలై ఆస్పత్రి పాలైంది. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగింది.

Pooja water poured into the tree attack colony members at kamareddy
పూజకు వాడిన నీటిని చెట్లకు పోసిందని మూకుమ్మడి దాడి
author img

By

Published : Mar 11, 2020, 4:42 PM IST

కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంత్రాల నెపంతో ఓ మహిళపై కాలనీవాసులు దాడి చేశారు. బతుకమ్మకుంట రంగాచారి కాలనీలో ఎర్రోళ్ల లలిత నివాసం ఉంటోంది. ప్రతి రోజు మాదిరిగానే సోమవారం కూడా ఇంట్లో పూజ చేసి ఆ నీటిని ఇంటి చెట్లకు పోసింది.

అంతే.. అప్పటిదాకా లేని అనుమానం ఒక్కసారిగా కాలనీ వాసులకు లలితపై కలిగింది. అంతే అనుకున్నదే తడవుగా కాలనీ వాసులు మంత్రాలు చేస్తున్నావంటూ ఆమెపై దాడికి దిగారు. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఈ దాడి విషయంపై కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

పూజకు వాడిన నీటిని చెట్లకు పోసిందని మూకుమ్మడి దాడి

ఇదీ చూడండి : పదేళ్ల తర్వాత తండ్రి చెంతకు కూతురు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.