కరోనా వైరస్ నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. రేషన్ కార్డు లేని వారికి ఉచితంగా రేషన్ బియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని.. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో ప్రారంభించారు. పోచారం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 25 కిలోల బియ్యాన్ని పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని 230 గ్రామాల్లో రేషన్ కార్డు లేని ఒక్కొ కుటుంబానికి 25 కిలోల బియ్యంను పోచారం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రంలో 40 లక్షల ఎకరాల్లో పండిస్తోన్న వరి పంటను ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. మండల కేంద్రంల్లో ఇప్పటికే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6900 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
పింఛన్ తీసుకునే చోట గుంపులుగా ఉండకూడదని సామాజిక దూరం పాటించి.. చెల్లింపులు జరపాలని సూచించారు. వైరస్ను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఇచ్చిన ఆదేశాలను ప్రజలందరూ తప్పక పాటించాలని కోరారు.
ఇవీ చూడండి: కరోనాపై పోరుకు కేంద్రం భారీ ప్యాకేజీ సిద్ధం