ETV Bharat / state

ఈ ఎన్నికల్లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే - సీఎం అయ్యేది బీసీ వ్యక్తినే : ప్రధాని మోదీ - తెలంగాణలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం

PM Modi Election Campaign in Kamareddy Today : తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని.. సీఎం అయ్యేది బీసీ వ్యక్తినే అని ప్రధాని మోదీ అన్నారు. ఎందుకంటే బీఆర్‌ఎస్‌ పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బీజేపీ విజయ సంకల్ప సభలో మోదీ ప్రసంగించారు.

modi
modi
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 25, 2023, 3:22 PM IST

Updated : Nov 25, 2023, 4:33 PM IST

PM Modi Election Campaign in Kamareddy Today : బీఆర్‌ఎస్‌ పాలనతో ప్రజలు విసిగిపోయారు.. ఆ పార్టీ పాలన నుంచి ప్రజలు స్వేచ్ఛను కోరుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) అన్నారు. గులాబీ పార్టీ పాలనలో తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. అలాగే 7 దశాబ్దాలు పాలించిన కాంగ్రెస్‌ నుంచి ప్రజల విముక్తి కోరుకుంటున్నారు. అందుకే ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం రాబోతుందని జోస్యం చెప్పారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభ(BJP Public Meeting)లో మోదీ పాల్గొని.. ప్రసంగించారు.

అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను బీజేపీ మేనిఫెస్టో(BJP Manifesto) ప్రతిబింబిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. బీజేపీ ఏదైతే చెబుతుందో వాటిని తప్పకుండా నెరవేర్చి తీరుతుందని చెప్పారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు(Woman Reservations) ఇచ్చామని.. అలాగే రాష్ట్రానికి ఇచ్చిన పసుపు బోర్డు, గిరిజన వర్సిటీ హామీలను కేంద్రం నెరవేర్చిందని గుర్తు చేశారు. బీజేపీ ప్రభుత్వం రాగానే బీసీ వ్యక్తిని సీఎం చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. కేంద్ర మంత్రివర్గంలో బీసీలకు అత్యధికంగా మంత్రి పదవులను ఇచ్చామని చెప్పారు. దళిత వ్యక్తిని సీఎం చేస్తాన్న కేసీఆర్‌.. హామీ ఏమైందని ప్రధాని మోదీ ప్రశ్నించారు. బీసీ, దళితులకు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు ఏమీ చేయలేదని విమర్శించారు.

ఢంకా భజాయించి చెబుతున్నా బీఆర్​ఎస్ ఓటమి ఖాయం : ప్రధాని మోదీ

'తెలంగాణలో మాదిగ సామాజికవర్గానికి అన్యాయం జరిగింది. మాదిగల వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉంది. మాదిగల వర్గీకరణ కోసం కమిటీ వేశాం. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులను మోసం చేసింది. ప్రాజెక్టుల పేరుతో బీఆర్‌ఎస్‌ అవినీతికి పాల్పడింది. బీఆర్‌ఎస్‌ నేతలకు డబ్బు కావాలంటే కొత్తగా ప్రాజెక్టులు నిర్మిస్తారు. రైతుల కోసం పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి. ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో రూ.2.75లక్షల కోట్లు జమ చేశాం. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ ద్వారా 40 లక్షల మంది రాష్ట్ర రైతులు లబ్ధి పొందారని' ప్రధాని మోదీ చెప్పారు.

"బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, టీపీసీసీ అధ్యక్షుడు నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. అందుకే వారిద్దరూ రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. కామారెడ్డిలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలను ఓటర్లు ఓడించాలి. బీజేపీ ఎప్పుడూ కూడా తెలంగాణ ప్రజలతో ఉంటుంది." -మోదీ, ప్రధాని

PM Modi Speech at BJP Public Meeting : రైతులకు రూ.300కే యూరియా బస్తా సరఫరా చేస్తున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా బీజేపీ కృషి చేస్తోందని తెలిపారు. రూ.15 వేల కోట్లతో పశువులకు ఉచిత వ్యాక్సిన్‌ వేస్తున్నామన్నారు. తెలంగాణలో యువత వ్యతిరేక ప్రభుత్వం వచ్చినందుకు బాధపడుతున్నామని.. ఏళ్ల తరబడి టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులకు సిద్ధమవుతున్న యువతను బీఆర్‌ఎస్‌ సర్కార్‌ మోసం చేసిందని ఆరోపించారు.

PM Modi Fires on BRS and Congress : టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీతో యువత మోసపోయారని ఆవేదన చెందారు. టీపీసీసీ అధ్యక్షుడు, కేసీఆర్‌ నిరాశ నిస్పృహల్లో ఉన్నారని.. నిరాశ నిస్పృహల్లో ఉన్నందునే రెండు చోట్ల పోటీ చేస్తున్నారన్నారు. అందుకే కామారెడ్డిలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలను ఓడించాలని కామారెడ్డి ఓటర్లను కోరారు.

ఈ ఎన్నికల్లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే - సీఎం అయ్యేది బీసీ వ్యక్తినే

ఎస్సీ వర్గీకరణ అంశానికి కట్టుబడి ఉన్నాం, త్వరలో కమిటీ వేస్తాం : ప్రధాని మోదీ

ఎన్టీపీసీ పవర్​ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ.. రూ.8 వేల కోట్ల పనులు ప్రారంభం

Last Updated : Nov 25, 2023, 4:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.