Police Officer Pet Dogs Attack On Neighbour Women In Sangareddy : పెంపుడు కుక్కలు ఉంటే పెంచిన వారికి ముద్దు కాని.. పక్కింటి వారికి ముద్దు కాదు కదా. అవి ఏం చేసిన వాటిని పెంచిన యజమానిని ప్రశ్నిస్తామే తప్ప.. ఆ శునకాలను కాదు. అలా తమ ఇంటి ముందు ఎందుకు కుక్కలతో మల విసర్జన చేయిస్తున్నావు అన్నందుకే.. పక్కటి మహిళపై పెంపుడు కుక్కల(Pet Dogs)తో ఓ పోలీస్ అధికారి భార్య దాడి చేయించింది. తీవ్రగాయాలైన ఆమె పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. బాధితురాలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో జరిగింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని రాజస్థాన్‌కు చెందిన ప్రకాశ్, వీణ ఇంటి నంబర్ 27లో గత కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. అయితే వీరి పక్క ఇంట్లో ఓ ఎస్పీఎఫ్ అధికారి కుటుంబం కూడా నివాసం ఉంటోంది. వారు రక్షణ కోసం కుక్కలను పెంచుకుంటున్నారు. అవి మల, మూత్ర విసర్జన చేయాల్సి వస్తే బయటకు తీసుకొచ్చి రోడ్డు మీద గానీ, పక్క ఇంటి ముందు గానీ చేయించేవారు.
Dogs Attack On Neighbour Women : అంతేకాకుండా చెత్తచెదారం కూడా రోడ్డు మీద, పక్కింటి దగ్గర వేసేవారు. ఏమైనా ఇరుగుపొరుగు వారు ఇదేంటని ప్రశ్నిస్తే.. నోటికి వచ్చినట్లు మాట్లాడి తన భర్త పోలీస్ అధికారిణని బెదిరించేది. ఇలా కాదు ఒకసారి సామరస్యంగా చెప్పి చూద్దామని.. కుక్కలను బయట మల, మూత్ర విసర్జన చేయించవద్దని వీణ.. చెప్పి చూశారు. కానీ అందుకు భిన్నంగా ఎస్పీఎఫ్ అధికారి భార్య స్పందించారు. ఇది ఏమైనా నీ సొంతిల్లులా మాట్లాడుతున్నావు.. ఇంకోసారి అలా మాట్లాడవద్దని దబాయించింది.
పెంపుడు కుక్కతో ఒక్కసారిగా దాడి : ఈనెల 14వ తేదీన మళ్లీ అలానే ఎస్పీఎఫ్ అధికారి భార్య పక్కంటిలో ఉండే వీణ ఇంటి ముందుకు వెళ్లి కుక్కలతో మల విసర్జన చేయించింది. ఇలా మరోసారి చేయించవద్దని చెప్పే ప్రయత్నం చేసేసరికి.. ఆగ్రహించిన అధికారి భార్య కుక్కలను పట్టుకొని ఉన్న బెల్ట్‌ను వదిలేసింది. దీంతో ఆ కుక్కలు వెళ్లి ఆమెపై దాడి చేసి.. తీవ్రంగా కరిచి గాయపరిచాయి. గాయపడిన మహిళ పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స తీసుకొని.. ఈనెల 16న అమీన్పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో ఎస్పీఎఫ్ అధికారి భార్యపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమె కాదు ఆ కాలనీలో ఉండే ప్రతి ఒక్కరు ఆ కుక్కలు, ఆమె వల్ల నిరంతరం భయంతో ఉంటున్నామని తెలిపారు. పోలీసులు ఈ విషయంపై నిర్లక్ష్యం చేయవద్దని కాలనీ వాసులు కోరారు.
Dog Attack on Kids in Shadnagar : చిన్నారులపై వీధికుక్క దాడి.. వీడియో వైరల్
Boy Dies in Dogs Attack in Hanamkonda : వీధి కుక్కల దాడికి మరో బాలుడు బలి