ఇదీ చూడండి: ఐస్క్రీమ్ పార్లర్లో అగ్నిప్రమాదం.. కాలిపోయిన రిఫ్రిజరేటర్లు
మంజీరానదిపై చెక్ డ్యాంల నిర్మాణానికి అనుమతులు మంజూరు - బాన్స్వాడ నియోజకవర్గంలో రెండు చెక్ డ్యాంల నిర్మాణం
బాన్సువాడ నియోజకవర్గంలో మంజీరానదిపై రెండు చెక్ డ్యాంల నిర్మాణానికి అనుమతులు మంజూరయ్యాయి. బీర్కూర్ వద్ద 28కోట్లా 29 లక్షల వ్యయంతో ఒకటి, బాన్సువాడ వద్ద 15 కోట్లా 98 లక్షల రూపాయల వ్యయంతో మరొక చెక్ డ్యాం నిర్మించనున్నారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ సాంకేతిక అనుమతులు మంజూరు చేసింది. చెక్ డ్యాంల నిర్మాణం కోసం సాంకేతిక అనుమతులు లభించడంపై శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అనుమతులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. చెక్ డ్యాంల నిర్మాణంతో మంజీరా నదిలో ఏడాది పొడవునా నీరు నిల్వ ఉంటుందని, భూగర్భ జలాలు పెరిగి రైతులకు ఉపయోగపడతుందని సభాపతి అన్నారు. వర్షాకాలం నాటికి చెక్ డ్యాంల నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు.

చెక్ డ్యాంల నిర్మాణానికి సాంకేతిక అనుమతులు