కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో కురిసిన అకాల వర్షానికి ధాన్యం కుప్పలు తడిసి ముద్దయ్యాయి. వివిధ గ్రామాలతో పాటు తిమ్మారెడ్డి, కల్యాణి, మౌలాన్ ఖేడ్ గ్రామాల్లో చిన్నచిన్న వడగండ్లు పడి ధాన్యపు గింజలు రాలి పోయాయి. మరికొన్ని గ్రామాల్లో 15 రోజుల్లో పంట కోతకు వస్తుందనగా పంటలు నేల రాలాయి. గత వర్షా కాలంలో తిమ్మారెడ్డి గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో అకాల వర్షానికి వడ్లు తడిసి మొలకెత్తాయి. అయినప్పటికీ అధికారులు మాత్రం మ్యాచర్ వచ్చే దాకా కొనుగోలు చేపట్టలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు అలా జరగకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని రైతులు కోరుతున్నారు.
ఎల్లారెడ్డిలో అకాల వర్షానికి తడిసిన ధాన్యం
కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి మండల పరిధిలోని పలు గ్రామాల్లో అకాల వర్షం కురిసింది. ఫలితంగా ధాన్యం కుప్పలు తడిసి ముద్దయ్యాయి.