ETV Bharat / state

26 ఇండ్లలో దొంగతనాలు.. 62 తులాల బంగారం స్వాధీనం - 62 తులాల బంగారం, 167 తులాల వెండి స్వాధీనం

రెండు జిల్లాలు.. 26 ఇండ్లలో దొంగతనాలు.. చిన్న అనుమానంతో పోలీసులకు పట్టుబడ్డాడు. దోచుకున్నది ఎంతో అయినప్పటికీ... జల్సాలకు అలవాటు పడి ఎంతో ఖర్చు చేశాడు. కానీ దోచుకున్న సొమ్ములో దాచుకున్న 62 తులాల బంగారం, 167 తులాల వెండిని మాత్రం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

26 ఇండ్లలో దొంగతనాలు.. 62 తులాల బంగారం స్వాధీనం
author img

By

Published : Oct 8, 2019, 2:12 PM IST

నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో మొత్తం 26 ఇళ్లలో పగటి దొంగతనాలకు పాల్పడిన అంతర్‌ జిల్లా దొంగను అరెస్టు చేసి రిమాండ్‌ పంపించినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్వేత చెప్పారు. మహారాష్ట్రకు చెందిన షేక్‌ చాంద్‌ అలియాస్‌ చందు అలియాస్‌ ఛాందయ్య అలియాస్‌ సమీర్​ను పట్టణంలోని రైల్వే స్టేషన్​లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పట్టుకున్నట్లు ఎస్పీ వివరించారు.

62 తులాల బంగారం, 167 తులాల వెండి స్వాధీనం

సదరు అనుమానితుడిని విచారించగా జిల్లాలోని దేవునిపల్లి పోలీసు స్టేషన్‌ పరిధిలో 11, కామారెడ్డి పట్టణంలో 6, నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని 4, 5వ పట్టణ పోలీసు స్టేషన్‌లలోని 9 ఇండ్లలో దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడని ఆమె స్పష్టం చేశారు. ఇలా మొత్తం రెండు జిల్లాల్లో కలిపి 26 ఇళ్లలో పగటి పూట దొంగతనాలకు పాల్పడిన షేక్‌చాంద్‌ జల్సాలకు అలవాటు పడి దోచిన సొమ్మును ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. చివరకు పోలీసులకు పట్టుబడిన సమయంలో అతడి వద్ద ఉన్న 62 తులాల బంగారం, 167 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ శ్వేత వెల్లడించారు.

జైలు శిక్షను అనుభవించినా... మార్పులేదు

మహారాష్ట్రకు చెందిన షేక్ చాంద్... కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో అణువణువూ తిరిగి ప్రాంతంపై పట్టు సాధించాకే... దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. 2009 నుంచి 2011 మధ్య కాలంలో దొంగతనాలు చేసి పోలీసులకు చిక్కి జైలులో ఊచలు లెక్కించాడని ఎస్పీ తెలిపారు. జైలు శిక్షను అనుభవించి విడుదలైనప్పటికీ... చోరీలు చేయడం ఆపలేదన్నారు. 2016 నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చి మళ్లీ దొంగతనాలకు తెరతీశాడని ఎస్పీ తెలిపారు. కేసుల ఛేదనలో చురకుగా వ్యవహరించిన పోలీసులకు రివార్డులిచ్చి అభినందించారు.

26 ఇండ్లలో దొంగతనాలు.. 62 తులాల బంగారం స్వాధీనం

ఇవీ చూడండి: దసరా ఉత్సవాల్లో ఎమ్మెల్యే అదిరిపోయే స్టెప్పులు..!

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.