ETV Bharat / state

సమయం 11 దాటినా ఆఫీస్​కు వచ్చేందుకు అధికారులకు తీరలేదు..! - kamareddy district news

ప్రభుత్వం, ప్రజలకు వారధిగా పనిచేసే ఓ కార్యాలయం తలుపులు ఉదయం 11 దాటినా తెరవలేదు. ఇదెక్కడో మారుమూల మండలంలో అనుకుంటే పొరపాటే సుమా!. కామారెడ్డి జిల్లా గాంధారి ఎంపీడీవో కార్యాలయానికి ఉదయం 11 దాటినా అధికారులు రాకపోవడం వల్ల తాళం తీసే దిక్కులేకుండా పోయింది. ప్రభుత్వ కార్యాలయంలో ఇంత నిర్లక్ష్యమా అంటూ ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

neglegency in government office in kamareddy district
11.30 గంటలు అయినా కార్యాలయం తలుపులు తెరవరా..!
author img

By

Published : Aug 27, 2020, 6:41 PM IST

ఉదయం 11 దాటిపోయినా ప్రభుత్వ కార్యాలయానికి అధికారులు రాకపోవడం వల్ల తాళం తీసే దిక్కు లేకుండా పోయింది. సమయం మించి పోతుండటం వల్ల చేసేదేమీ లేక సిబ్బంది తాళం పగులగొట్టి కార్యాలయం లోనికి వెళ్లారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా గాంధారి ఎంపీడీవో కార్యాలయంలో చోటుచేసుకుంది. నేడు కార్యాలయం వద్దకు వివిధ పనుల నిమిత్తం కొంత మంది ప్రజలు అక్కడికి చేరుకున్నారు. ఉదయం 11:30 కావొస్తున్నా ఒక్క అధికారి కూడా కార్యాలయానికి రాలేదు.

పైగా కార్యాలయానికి తాళం వేసి ఉండటం వల్ల ఈ రోజు ఆఫీస్ సెలవేమో అని ప్రజలు భావించారు. కానీ అంతలోనే కార్యాలయ సిబ్బంది వచ్చి ఓ బండ రాయితో తాళం పగులగొట్టి లోపలికి వెళ్లారు. 10 గంటల వరకు కార్యాలయానికి రావాల్సిన అధికారులు రాకపోవడంతో పాటు తాళం తీసేవారు కూడా లేకపోవడం పట్ల ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇవీ చూడండి: వైద్యారోగ్య శాఖలో ఖాళీలను భర్తీ చేయండి: భట్టి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.