ETV Bharat / state

ఇంటింటికి మంచినీటి సరఫరాలో నిర్లక్ష్యం

మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీరందించే స్థిరీకరణ పనులు ఈ నెలాఖరుకు పూర్తిచేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులను ఆదేశించారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పనుల్లో నిర్లక్ష్యం నెలకొనడంతో గడువులోపు అందించడం ప్రశ్నార్థకంగానే మారింది. ‘ఈనాడు’ బృందం రెండ్రోజులు మండల కేంద్రాలతో పాటు పలు గ్రామాల్లో పరిశీలన చేయగా పలు లోపాలు వెలుగుచూశాయి.

author img

By

Published : Oct 5, 2020, 1:44 PM IST

Neglect in mission bhagiratha water supply to the house in kamareddy district
ఇంటింటికి మంచినీటి సరఫరాలో నిర్లక్ష్యం

శ్రీరాంసాగర్‌, సింగూర్‌ జలాశయాల సమీపంలో శుద్ధీకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి గ్రిడ్‌ ద్వారా జిల్లాకు నీటిని పంపింగ్‌ చేస్తున్నారు. సింగూర్‌లో నీరు లేక రెండేళ్లుగా సరఫరా నిలిచిపోయింది. ఎస్సారెస్పీ నుంచి నీటి సరఫరా కొనసాగిస్తున్నా క్షేత్రస్థాయిలో పనులు పూర్తికాక అస్తవ్యస్తంగా మారింది.

నత్తనడకన కుళాయిల బిగింపు

జిల్లావ్యాప్తంగా ఇంటింటికి కుళాయిలు బిగించినట్లు నివేదికల్లో తాగునీటి సరఫరా విభాగం అధికారులు పేర్కొంటున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరేలా ఉంది. మండల కేంద్రాల్లో కుళాయిల బిగింపు నత్తనడకన సాగుతోంది.

లింగంపేట, మద్నూర్‌, బాన్సువాడ, భిక్కనూర్‌ మండల కేంద్రాల్లో కుళాయిలు బిగించాల్సి ఉంది. గ్రామాల శివారు కాలనీలకు పైపులైన్ల ఏర్పాటుతో పాటు కనెక్షన్లు ఇవ్వడం మరిచారు.

వివరాలిలా...

మారని తీరు

తాగునీటి సరఫరా విభాగం అధికారుల నిర్లక్ష్యాన్ని ఎమ్మెల్యేలతో పాటు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పలుమార్లు తప్పుపట్టినా వారి పనితీరులో మార్పు రాలేదు. తన నియోజకవర్గంలో భగీరథ పనులు పూర్తికాకపోవడంపై గతేడాది జడ్పీ సర్వసభ్య సమావేశంలో కామారెడ్డి ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కుళాయిలు బిగించలేదు

మద్నూర్‌: మండల కేంద్రంలో పైపులను ఇలా వృథాగా వదిలేశారు. పైపులైన్‌ వేయడంతో పాటు ఇంటింటికి ఒక కనెక్షన్‌ ఇచ్చారు. ట్యాంకులకు నీటి సరఫరా కనెక్షన్‌ ఇవ్వలేదు. కుళాయిలూ బిగించలేదు.

సరఫరా అరకొరే

  • నీరిచ్చే విషయంలో ఆధునిక విధానం ప్రవేశపెట్టారు. ప్రతి కుటుంబానికి 500 లీటర్లు, ఒక్కొక్కరికి 100 లీటర్లు అందించాల్సి ఉంది.
  • నీటి చౌర్యం చేయకుండా, మోటార్లు బిగించకుండా ప్రతి ఇంటికి స్లో కంట్రోలు వాల్వ్‌ ఏర్పాటు చేయాల్సి ఉన్నా అది కార్యరూపం దాల్చలేదు.
  • మాచారెడ్డి మండల కేంద్రంలో రెండంటే రెండు బిందెలే వస్తున్నాయని గ్రామస్థులు పేర్కొంటున్నారు. జిల్లాలో చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉంది.

సింగూర్‌ సెక్టార్‌లో

సింగూర్‌లో నీరు లేక రెండేళ్లుగా శుద్ధీకరణ నిలిచింది. ఇటీవల భారీగా వరద చేరడంతో నీటి పంపింగ్‌కు గ్రిడ్‌ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. టెస్టింగ్‌ డ్రైవ్‌ను చేపడుతూ లీకేజీలున్నచోట పునరుద్ధరిస్తున్నారు. ఇంతలోపు ఇంట్రావిలేజ్‌ పనులు పూర్తయితే ఇంటింటికి నీరందే అవకాశం ఉంది. పది హేను రోజుల్లో నీటి సరఫరా ప్రారంభిస్తామని సింగూరు సెక్టార్‌ గ్రేడ్‌ ఈఈ చౌదరి పేర్కొన్నారు.

తక్షణమే పూర్తి చేయిస్తాం..

జిల్లా వ్యాప్తంగా ఈ నెలాఖరులోగా కనెక్షన్ల స్థిరీకరణ పూర్తిచేస్తాం. కేవలం మండల కేంద్రాల్లోనే కుళాయిల బిగింపు మిగిలింది. ప్రతి గ్రామంలో ట్యాంక్‌ల నిర్మాణం, కుళాయి కనెక్షన్ల బిగింపు శతశాతం పూర్తయింది. అసంపూర్తిగా ఉన్నట్లు ఫిర్యాదు అందితే తక్షణమే పూర్తి చేయిస్తాం.- లక్ష్మీనారాయణ, ఈఈ, తాగునీటి సరఫరా విభాగం, కామారెడ్డి

నీరు రాకుండానే పైపు పగిలింది

రాజంపేట: మిషన్‌భగీరథ పైపులైన్‌ను ట్యాంక్‌కు అనుసంధానం చేయకుండా వదిలేశారు. పాత మార్గం ద్వారానే నీటిని సరఫరా చేస్తున్నారు. గ్రామంలోని పెద్దమ్మ దేవాలయం వద్ద కాలనీలో పైపు పగిలిపోయింది. ఏడాదిగా భగీరథ నీటికి దూరంగా ఉన్నాం.- బోయిని లక్ష్మి, తలమడ్ల, రాజంపేట.

అనుసంధానం ఆగింది

రాజంపేట: మండల కేంద్రంలో ఇంటింటికి కనెక్షన్‌ ఇవ్వకపోవడంతో ఏడాదిగా వృథాగా ఉంటున్నాయి. కుమ్మరిగల్లీలో ప్రధాన పైపులైన్‌కు అనుసంధానం చేయకపోవడం వల్ల కాలనీకే నీరు రావడం లేదు. కవ్యనిటీ బోరుపై ఆధారపడుతున్నాం. కుళాయిలకు సిమెంట్‌ దిమ్మెల నిర్మాణాలు చేపట్టలేదు. ఏడాదిగా నీటి కోసం ఇబ్బంది పడుతున్నాం. - కుమ్మరి నారాయణ, రాజంపేట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.