ETV Bharat / state

మానవత్వం చాటుకున్న యువకులు... కరోనా మృతదేహానికి అంత్యక్రియలు

కామారెడ్డి జిల్లా బాన్సువాడలో కరోనాతో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని తరలించేందుకు బంధువులు, స్థానికులు ఎవరూ ముందుకు రాకపోయినా... ముస్లిం యువకులు ముందుకొచ్చి శ్మశాన వాటికకు తరలించి మానవత్వం చాటుకున్నారు.

muslims shown humanity on corona dead boy cremations

author img

By

Published : Sep 5, 2020, 8:08 PM IST

కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని ఎన్జీవోస్ కాలనీకి చెందిన నర్సింలు(65) అనే రిటైర్డ్ క్లర్కుకు నాలుగు రోజుల కింద కరోనా సోకగా... ఈ రోజు ఉదయం 10గంటల సమయంలో మరణించారు. అంత్యక్రియల కోసం బంధువులు, స్థానికంగా తెలిసిన వారందరికీ నర్సింలు కుమారుడు పవన్​కుమార్​ సమాచారం ఇవ్వగా... ఎవ్వరూ ముందుకు రాలేదు. చివరకు స్థానిక కౌన్సిలర్ భర్త అమర్​ను పవన్​ సంప్రదించారు.

తనతో పాటు మరో నలుగురు యువకుల సాయం తీసుకున్న అమర్.. ఆంబులెన్స్ తెప్పించారు. అందరూ పీపీఈ కిట్లు ధరించి మృతదేహాన్ని ఇంట్లో నుంచి తీసుకొచ్చి ఆంబులెన్స్​లో శ్మశాన వాటికకు తరలించారు. అక్కడ అంత్యక్రియలకు అవసరమైన అన్ని వస్తువులు తెప్పించి ఇచ్చారు. ఆ తర్వాత శ్మశాన వాటికలో మున్సిపాలిటీ సిబ్బంది అంత్యక్రియలు పూర్తి చేశారు.

నర్సింలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో క్లర్కుగా పని చేసి రిటైర్డ్ అయ్యారు. తన తండ్రి అంత్యక్రియల కోసం బంధువులు, తెలిసినవాళ్లు ఎవ్వరూ రాలేదని... అమర్​తో పాటు నలుగురు ముస్లిం యువకులు సాయం చేశారని పవన్​ తెలిపాడు. మానవత్వంతో ముందుకొచ్చి సాయం చేసిన యువకులకు పవన్​ కృతజ్ఞతలు తెలిపాడు.

ఇవీ చూడండి: మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.