ఆయన ఓ యాచకుడు. భార్యాపిల్లలు లేరు. ఆలయం వద్ద ఉంటూ భక్తులు పెట్టే భోజనం తిని వారిచ్చే సొమ్మును పొదుపుగా దాచుకునే వారు. సదరు వ్యక్తి సోమవారం గుండెపోటుతో ఆలయ ఆవరణలో మృతిచెందారు. అతని వద్ద రూ.1.32 లక్షలతో పాటు మరో 9 వేలు రద్దయిన కరెన్సీ లభించింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం కోమట్‌పల్లిలో చోటు చేసుకుంది.
గ్రామానికి చెందిన యాచకుడు సాహెబ్‌అలీ(60) స్థానికంగా ఉన్న ఆలయంలో భక్తులు నిర్వహించే పండగలకు మేకలు, కోళ్లు కోసేవారు. అక్కడే భోజనం చేసి రాత్రి సమయంలో గ్రామంలో నిద్రించేవారు. సంపాదించిన సొమ్మును ఎవరికీ అనుమానం రాకుండా నడుమునే బ్యాంకుగా మలుచుకున్నారు. నడుముకు బెల్టు మాదిరిగా గుడ్డతో గల్లాలు కుట్టుకొని అందులో దాచుకున్నారు. సోమవారం గుండెపోటుతో ఆయన ప్రాణాలు విడిచారు. మృతదేహాన్ని పరిశీలించగా నడుము చుట్టూ నోట్ల కట్టలు బయటపడటంతో గ్రామస్థులు అవాక్కయ్యారు. శవాన్ని సోదరులకు, నగదును మతపెద్దలకు అప్పగించారు.
ఇదీ చూడండి:సిరా, స్కెచ్ పెన్నుల కోసం రూ.10 లక్షలు