కామారెడ్డి పట్టణ శివారులోని టెక్రియాల్ వద్ద జరిగిన ధర్నా సందర్భంగా ఎంపీ అర్వింద్‌పై ఎమ్మెల్సీ కవిత విమర్శలు గుప్పించారు. ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని చెప్పి.. రెండేళ్లయినా పత్తా లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. పసుపు బోర్డు పేరు చెప్పి ఓట్లేయించుకుని మోసం చేశారని విమర్శించారు.
ఇప్పుడు మూడు బిల్లులు తెచ్చి రైతులకు మంచి జరుగుతుందని చెప్తే ఎలా నమ్ముతామని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రోడ్డుపై బైఠాయించి ధర్నాలు చేసి స్వరాష్ట్రాన్ని సాధించుకుని గుర్తు చేసిన కవిత... ఇప్పుడు కూడా కేంద్ర బిల్లులను రద్దు చెపించేందుకు దేశమంతా ఒక్కటైందన్నారు. ఉద్యమ స్ఫూర్తితో కేంద్రం తెచ్చిన చట్టాలు వెనక్కి తీసుకునే వరకు పోరాడాలని సూచించారు.