కొవిడ్ నేపథ్యంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా.. సంక్షేమ పథకాలను మాత్రం ఆపకుండా కొనసాగించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఎమ్మెల్యే సురేందర్ కొనియాడారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఎల్లారెడ్డిపల్లిలో జరిగిన కల్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మండలంలోని 27మంది లబ్ధిదారులకు ఆయన చెక్కులు పంపిణీ చేశారు.
తెరాస ప్రభుత్వం.. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తోందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో.. ఇన్ని పథకాలున్నాయా అంటూ ప్రశ్నించారు.
మతం పేరిట భాజపా నీచ రాజకీయాలకు పాల్పడుతోందన్నారు ఎమ్మెల్యే. ఎన్నికల సమయంలో భాజపా నేతలు.. ప్రజల్లో మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తుంటారని ఆరోపించారు. ప్రజలు ఆ విషయాన్ని గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: 'పేదరికమే ప్రామాణికంగా 'డబుల్' లబ్ధిదారుల ఎంపిక'