కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే జాజల సురేందర్ చెక్కులను పంపిణీ చేశారు. ఎల్లారెడ్డి, లింగం పేట, నాగిరెడ్డిపేట మండలాలకు చెందిన 510 మందికి చెక్కులను పంపిణీ చేశారు.
అనంతరం వారికి సొంత ఖర్చుతో పట్టుచీరను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తెరాస ప్రభుత్వ పాలనను కొనియాడారు.
ఇదీ చదవండి: ఖమ్మంలో కేటీఆర్ పర్యటన మరోసారి వాయిదా