ETV Bharat / state

'ఉద్యోగాల కోసం దళారులను నమ్మి మోసపోకండి' - పోలీసు, ఆర్మీ ఉద్యోగాల కోసం అవగాహన కార్యక్రమం

రాష్ట్రంలో ఉద్యోగ నియామక ప్రక్రియ ఎంతో పారదర్శకంగా జరుగుతుందని కామారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే గంప గోవర్థన్​ అన్నారు. ఈ మేరకు ఎస్పీ శ్వేతతో కలిసి జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్​ హాల్లో అవగాహనా కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు.

mla gampa goverdhan says do not be fooled into believing agents for jobs'
'ఉద్యోగాల కోసం దళారులను నమ్మి మోసపోకండి'
author img

By

Published : Jan 17, 2021, 6:14 PM IST

ఉద్యోగాల కోసం దళారులను నమ్మి ఎవరూ మోసపోవద్దని కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్​ గంప గోవర్థన్​ అన్నారు. జిల్లా కేంద్రంలోని కేవీఎస్​ ఫంక్షన్​ హాల్లో ఆర్మీ, పోలీసు ఉద్యోగాలపై జిల్లా ఎస్పీ శ్వేతతో కలిసి అవగాహనా కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు.

దేశ భవిష్యత్ యువత చేతిలో ఉందని ఎమ్మెల్యే గంప గోవర్థన్​ అన్నారు. దేశ రక్షణ కోసం యువతీయువకులు ఆర్మీ, పోలీసు ఉద్యోగాలల్లో చేరాలని ఆయన కోరారు. ఉద్యోగాల విషయంలో ఉన్న అపోహలను ఎమ్మెల్యే తొలంగించారు. ఉద్యోగ నియామక ప్రక్రియ ఎంతో పారదర్శకంగా జరుగుతుందని, దళారులను నమ్మి ఎవరూ మోసపోవద్దని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్​ ఆర్మీ కల్నల్​ శ్రీనివాసరావు పాల్గొని పలు సూచనలు చేశారు.

ఇదీ చదవండి: బెంగళూరులో ఐసిస్​​ ముష్కరుడి ఆనవాళ్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.