అటవీ చట్టం ప్రకారం దేశవ్యాప్తంగా 33 శాతం పచ్చదనం(forest plants and trees) ఉండాలి. రాష్ట్రంలో 24 శాతమే ఉండటంతో మొక్కల పెంపకంతో పాటు అడవుల సంరక్షణ చేపట్టి లక్ష్యం చేరుకోవాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఈ క్రమంలోనే హరితహారం పేరిట ఏటా భారీగా మొక్కలు నాటిస్తోంది. వీటితో పాటు రహదారుల విస్తరణ సందర్భంగా కొట్టేసిన చెట్లను వేరే ప్రాంతాల్లో నాటించి(forest plants and trees) సంరక్షిస్తున్నారు. ఇందులో భాగంగా సంగారెడ్డి -నాందేడ్- అకోలా(NH- 161) రహదారి విస్తరణలో తొలగించిన చెట్లను స్థానాంతీకరణ(ట్రాన్స్‌లోకేషన్) పద్ధతిలో నాటించింది. వీటిలో 50శాతం మేర ఏనుకునేలా(అంటుకునే విధంగా) చేయడంలో కామారెడ్డి జిల్లా అటవీశాఖ అధికారులు విజయం సాధించారు.
రోడ్ల విస్తరణలో కొట్టేసిన ఏళ్ల నాటి వృక్షాలకు ఊపిరి పోసిన అటవీశాఖ
బాన్సువాడ అటవీ డివిజన్ పరిధిలో
ఎన్‌హెచ్- 161 విస్తరణతో కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం నర్సింగరావుపల్లి నుంచి మద్నూర్ మండలం సలాబత్‌పూర్ వరకు 300పైగా భారీ వృక్షాలను తొలగించారు. ఇందులో వందల ఏళ్ల నాటి చెట్లున్నాయి. వీటిని ఎలాగైనా బతికించాలన్న ఉద్దేశంతో అటవీశాఖ అధికారులు ముందుగానే రహదారి విస్తరణ చేపడుతున్న గుత్తేదారులతో చర్చించి చెట్లను తొలగించే క్రమంలో మొదటగా కొమ్మలు తీసివేసి క్రేన్ సాయంతో వేర్లతో సహా పెకిలించాలని కోరారు. అనంతరం వాటిని భారీ ట్రాలీ ద్వారా బాన్సువాడ అటవీ డివిజన్ పరిధిలోని పిట్లం రేంజ్‌లో మంగ్లూర్, వడ్డేపల్లి, జుక్కల్ రేంజ్ పరిధిలోని కౌలాస్ అటవీ ప్రాంతాలకు తీసుకెళ్లి నాటించారు(forest plants and trees). ఇలా 105 వృక్షాలను ట్రాన్స్‌లొకేషన్ చేశారు.
ప్రత్యేక విధానం ద్వారా
రహదారి విస్తరణలో తొలగించిన వృక్షాలను తిరిగి నాటే ముందు వేర్లు తిరిగి వృద్ధి చెందేందుకు ఐబీఏ(ఇండోల్ బట్రిక్ యాసిడ్) పట్టించారు. అనంతరం సరిపడా నీళ్లు పోయడం, వర్మి కంపోస్టు ఎరువులు చల్లుతూ నిరంతరం పర్యవేక్షించారు. ఈ పద్ధతి ద్వారా ఒక్కో చెట్టును నాటించడానికి రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు వ్యయం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలా నాటిన వాటిలో 30 శాతమే చిగురించగా.. కామారెడ్డి జిల్లాలో సగానికిపైగా చిగురించాయని జిల్లా అటవీశాఖ అధికారి నిఖిత చెబుతున్నారు. అటవీ చట్టం ప్రకారం దేశవ్యాప్తంగా 33 శాతం పచ్చదనం ఉండాలి. రాష్ట్రంలో 24 శాతమే ఉండటంతో మొక్కల పెంపకంతో పాటు అడవుల సంరక్షణ చేపట్టి లక్ష్యం చేరుకోవాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఈ క్రమంలోనే హరితహారం పేరిట ఏటా భారీగా మొక్కలు నాటిస్తోంది. వీటితో పాటు రహదారుల విస్తరణ సందర్భంగా కొట్టేసిన చెట్లను వేరే ప్రాంతాల్లో నాటించి సంరక్షిస్తున్నారు. వీటిలో 50శాతం మేర ఏనుకునేలా(అంటుకునే విధంగా) చేయడంలో కామారెడ్డి జిల్లా అటవీశాఖ అధికారులు సక్సెస్ అయ్యారు.
ఇదీ చదవండి: Farmer problems: విద్యుత్‌శాఖ అధికారుల నిర్లక్ష్యం.. రైతన్నకు శాపం