ETV Bharat / state

'ఆగమ శాస్త్రానికి వ్యతిరేకంగా కుమార స్వామి ఆలయ నిర్మాణం'

ఆగమ శాస్త్రానికి వ్యతిరేకంగా శ్రీశైలంలో కుమార స్వామి ఆలయాన్ని నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మహాదేవ్ మహారాజ్ ఆరోపించాడు. శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని దెబ్బతీసేందుకు ఏపీ ప్రభుత్వం.. ఓ సంస్థ కుట్ర చేస్తుందన్నారు.

'ఆగమ శాస్త్రానికి వ్యతిరేకంగా కుమార స్వామి ఆలయ నిర్మాణం'
'ఆగమ శాస్త్రానికి వ్యతిరేకంగా కుమార స్వామి ఆలయ నిర్మాణం'
author img

By

Published : Sep 25, 2020, 4:38 PM IST

ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్రను ఆపాలని మహాదేవ్ మహారాజ్ డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుడ్​మెట్ పీఠాధిపతి మహాదేవ్ మహారాజ్ మద్నూర్, బిచ్కుంద, జుక్కల్ మండలాల్లో పర్యటించారు. ఆగమ శాస్త్రానికి వ్యతిరేకంగా శ్రీశైలంలో కుమార స్వామి ఆలయాన్ని నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని దెబ్బతీసేందుకు ఏపీ ప్రభుత్వం.. ఓ సంస్థ కుట్ర చేస్తుందన్నారు.

ప్రధాన ఆలయ సమీపంలో రూ.400 కోట్లతో 16 ఎకరాల్లో కుమారస్వామి ఆలయం నిర్మించడం తగదన్నారు. ఏపీ ప్రభుత్వం ఆలయ నిర్మాణానికి ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేశారు. ఈ విషయాన్ని తెలుగు రాష్ట్రాల్లోని భక్తులందరికి తెలియజేస్తూ.. చైతన్యం తీసుకువస్తున్నామని తెలిపారు.

ఇవీ చూడండి: యువతి ప్రేమ పెళ్లి.. పరువు కోసం ఆమె భర్త హత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.