ETV Bharat / state

ఆ చెక్​పోస్ట్ నుంచి మహారాష్ట్రకు రాకపోకలు బంద్ - latest news of kamareddy

మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం మరికొన్ని కఠిన నిబంధనలు విధించింది. ఇతర రాష్ట్రాల నుంచి అనుమతి లేని వాహనాల రాకపోకలను నిలిపివేసింది. ఫలితంగా కామారెడ్డి జిల్లాలోని మద్నూర్​-మహారాష్ట్ర నాందేడ్ ​జిల్లాకు రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. ఆ రాష్ట్ర పోలీసులు మద్నూర్​ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి వేరే రాష్ట్ర, జిల్లాల ప్రజలను తమ ప్రాంతంలోనికి రావొద్దంటూ అడ్డుకుంటున్నారు.

madnur boarder closed by maharastra police at kamareddy
మద్నూర్​- మహారాష్ట్ర సరిహద్దు బంద్
author img

By

Published : Jul 14, 2020, 1:09 PM IST

కరోనా కేసుల ఉద్ధృతి నేపథ్యంలో మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా వ్యాప్తంగా ఈనెల 20 వరకు లాక్​డౌన్ అమలు చేయాలని మహా ప్రభుత్వ నిర్ణయాల మేరకు అధికారులు అప్రమత్తం అయ్యారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సలబత్​పూర్-మహారాష్ట్ర సరిహద్దు వద్ద మహా పోలీసులు తనిఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జాతీయ రహదారిపై బారికేడ్లు ఏర్పాటు చేసి.. లారీలను మినహాయించి మిగితా వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి ఏ ఒక్కరిని కూడా తమ జిల్లాలోకి అనుమతించబోమని పేర్కొంటున్నారు. అత్యవసరం అయితే తప్ప మద్నూర్, బిచ్కుంద, జుక్కల్ సరిహద్దు మండలాల ప్రజలు మహారాష్ట్ర డేగ్లూర్ పట్టణంలోకి రావొద్దని సూచిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని పలు మండలాల వాసులు దేగ్లూర్​కి కాలిబాటన వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.

ఇదీ చూడండి: బాలిక అభ్యర్థనపై స్పందించిన కలెక్టర్..​ స్మార్ట్​ఫోన్​ కానుక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.