కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలంలోని మంజీరా నది పరివాహక ప్రాంతంలో చిరుత పులి సంచరించింది. మంజీరా నది పరివాహక ప్రాంతంలోని ఇసుక రీచ్‌లో తిరుగుతున్నట్లు సీసీ కెమెరాలో నమోదైైంది. చిరుతన బంధించడానికి అటవీ అధికారులు పలు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆ ప్రయత్నాలు విఫలం కావడంతో మండల కేంద్ర పరివాహక ప్రాంతాల్లో చిరుత విచ్చలవిడిగా సంచరిస్తోంది. చిరుతపులి సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు త్వరగా చిరుతను బంధించాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: చేతికర్రతోనే చిరుతను తరిమికొట్టిన బామ్మ..!
leopard spotted in kamareddy: నివాస ప్రాంతాల్లో చిరుత సంచారం.. అప్రమత్తంగా ఉండండి