ETV Bharat / state

కామారెడ్డి జిల్లా సీతాయిపల్లిలో చిరుత కలకలం

కామారెడ్డి జిల్లా సీతాయిపల్లి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో చిరుత కలకలం రేపింది. పశువుల కాపరులకు చిరుత కనిపించటంతో అటవీ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు ఆ ప్రాంతంలో పరిశీలించి ఎవరూ అటు వైపు రాకూడదని తెలిపారు.

leopard in kamareddy district
కామారెడ్డి జిల్లా సీతాయిపల్లిలో చిరుత కలకలం
author img

By

Published : May 3, 2020, 10:39 PM IST

కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలోని సీతాయిపల్లి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఆదివారం ఉదయం పశువుల కాపరులకు చెట్టుపై చిరుత కనిపించింది. దీంతో ఆందోళనకు గురైన కాపరులు తిరిగి గ్రామానికి వెనుదిరిగారు. అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడం వల్ల ఎఫ్​ఆర్​వో చంద్రకాంత్ రెడ్డి తన సిబ్బందితో ఆ ప్రాంతంలో గాలించారు. అక్కడ చెట్టుపై చిరుత గాట్లను గుర్తించారు. సమీపంలోనే దాని మలం ఉన్నట్లు తెలిపారు. తరచూ ఇదే ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు ఎఫ్​ఆర్​వో పేర్కొన్నారు. గ్రామస్థులు, పశువుల కాపరులు ఎవరూ ఇటు వైపు రాకూడదని తెలిపారు.

ఇవీ చూడండి: 20 కిలోమీటర్లు గుట్టల్లో నడిచి.. సరకులు పంచిన సీతక్క

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.