ETV Bharat / state

KCR to Contest from Kamareddy in Elections 2023 : కామారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా బరిలో సీఎం కేసీఆర్‌!

KCR to Contest from Kamareddy in Elections 2023: కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్ర ప్రజలందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేగా బరిలో ఉంటారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. నెలన్నరగా సీఎం పోటీపై సామజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. ఇది నిజమేనన్నట్టు సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ వ్యాఖ్యలు మరింత బలం చేకూర్చేలా ఉన్నాయి. తానే కేసీఆర్‌ను కామారెడ్డి నుంచి పోటీ చేయాలని కోరినట్టు అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తుత ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు.

Kamareddy Assembly Constituency
CM KCR From Kamareddy to Assembly Ring
author img

By

Published : Aug 8, 2023, 7:14 AM IST

CM KCR From Kamareddy to Assembly Ring ఈసారి కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ

KCR to Contest from Kamareddy in Elections 2023 : కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం(Kamareddy Assembly Constituency) రాష్ట్ర వ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడి నుంచి సీఎం కేసీఆర్ అసెంబ్లీ బరిలో ఉంటారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. నెలన్నరగా కేసీఅర్ పోటీపై సామజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. ఇది నిజమేనన్నట్టు సిట్టింగ్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఆజ్యం పోశాయి. తానే కేసీఆర్​ను కామారెడ్డి నుంచి పోటీ చేయాలని కోరినట్టు అసెంబ్లీ సమావేశాల సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ చెప్పుకొచ్చారు. దీంతో ఒక్కసారిగా కామారెడ్డి రాష్ట్ర దృష్టిని ఆకర్షిస్తోంది.

KCR contest as MLA from Kamareddy : రానున్న శాసనసభ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పోటీచేయాలని కోరినట్లు ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పేర్కొనడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొద్ది రోజుల నుంచి సామాజిక మాధ్యమాలతో పాటు ఇతరత్రా సంభాషణల్లోనూ కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీచేస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ స్వయంగా కేసీఆర్‌ను ఇక్కడి నుంచి పోటీ చేయాలని కోరినట్లు ప్రకటించిన తరుణంలో.. సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేసీఆర్ పూర్వీకుల గ్రామం కోనాపూర్ నియోజకవర్గంలోనే ఉండడంతో మరింతగా చర్చ జరుగుతోంది.

అబద్ధాలు చెప్పి రైతులను రెచ్చగొడుతున్నారు: గంప గోవర్ధన్‌

Telangana Assembly elections 2023 : ముఖ్యమంత్రి తల్లిదండ్రులు రాఘవరావు, వెంకటమ్మ కేసీఆర్ బాల్యంలో బీబీపేట మండలం కోనాపూర్‌లో నివసించారు. ఎగువ మానేరు నిర్మాణ సమయంలో సాగు భూములు ముంపునకు గురవడంతో సిద్దిపేట మండలం చింతమడకకు వలస వెళ్లారు. కానీ ఇప్పటికీ కోనాపూర్‌ను తమ సొంత గ్రామంగానే భావిస్తుంటారు. గ్రామాభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి రూ.30 కోట్లు కేటాయించారు. అయితే త్వరలో తల్లి శోభమ్మతో కలిసి కోనాపూర్‌ను సందర్శిస్తానని మంత్రి కేటీఆర్(KTR Visits Kamareddy) గతంలో చెప్పారు.

CM KCR to Contest From Kamareddy Assembly Constituency : తెలంగాణ ఉద్యమ సమయం(Telangana Movement)లో.. కేసీఆర్ పలుమార్లు జిల్లాలో పర్యటించిన విషయాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డిలో జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ ప్రాంత ఉద్యమకారులతో పాటు న్యాయవాదులు, విద్యావంతులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక సంబంధాలున్నాయి. రాజంపేట మండలంలోని ఆల్గొండలోని తన మేనమామ ఇంట్లో బాల్యాన్ని గడిపినట్లు పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ ప్రాంతాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రానికి వైద్యకళాశాల మంజూరు చేశారు.

కామారెడ్డి నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా గంప గోవర్ధన్ ఉన్నారు. గంపతో పాటు జిల్లా అధ్యక్షుడు ముజీబ్, నిట్టు వేణులు ఈసారి టికెట్ ఆశిస్తున్నారు. ఇంతలోనే కేసీఆర్ స్వయంగా పోటీ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. అదే జరిగితే ఉమ్మడి జిల్లాతో పాటు పక్కనున్న జిల్లాలపైనా కేసీఆర్ ప్రభావం ఉండనుంది.

KTR inagurate school in Bibipet : మహేశ్​బాబు కోసం బీబీపేట్​ గ్రామస్థుల ఎదురుచూపులు..

KTR School in konapur : నాయనమ్మకు ప్రేమతో.. రెండున్నర కోట్ల సొంత ఖర్చులతో స్కూల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.