ETV Bharat / state

Kamareddy, Telangana Elections Result 2023 Live : కామారెడ్డి షాకింగ్ రిజల్ట్ - రేవంత్‌, కేసీఆర్​ నెట్టేసి గెలిచిన వెంకటరమణ - తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023 లైవ్

Kamareddy, Telangana Elections Result 2023 Live : తెలంగాణ సర్వత్రా ఆసక్తి నెలకొన్న నియోజకవర్గం కామారెడ్డి. ఒకవైపు సీఎం కేసీఆర్ మరోవైపు టీపీసీసీ ఛీఫ్​ రేవంత్​రెడ్డి పోటాపోటీగా ఎన్నికల బరిలో నిలుచున్నారు. ఈ నియోజకవర్గాన్ని బీజేపీ కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. కౌంటింగ్ పూర్త్యయ్యే సరికి బీజేపీ అభ్యర్థి వెంకటరమణ గెలుపొందారు.

Kamareddy Elections Result 2023 Live
Telangana Elections Result 2023 Live
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 3, 2023, 2:55 PM IST

Updated : Dec 3, 2023, 6:22 PM IST

Kamareddy, Telangana Elections Result 2023 Live : తెలంగాణ ఎన్నికల్లో అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్న కామారెడ్డి నియోజకవర్గంలో మొదటి నుంచి రేవంత్​ రెడ్డి హవా సాగింది. దాదాపుగా కేసీఆర్‌పై (KCR) రేవంత్ గెలుపు ఖాయం అనుకుంటున్న తరుణంలో.. అకస్మాత్తుగా బీజేపీ (BJP) అభ్యర్థి వెంకటరమణ రెడ్డి ముందంజలోకి దూసుకొచ్చారు. ప్రస్తుతం ఆయనే ఆధిక్యం కొనసాగిస్తున్నారు. 13వ రౌండ్​ నుంచి అధిక్యంలో ఉన్న వెంకటరమణ అన్ని రౌండ్లు పూర్తయ్యే సరికి 5వేల ఓట్ల మెజారిటీతో విజయ కేతనం ఎగురవేశారు.

Kamareddy Elections Result 2023 Live
Kamareddy, Telangana Elections Result 2023 Live

BJP, Telangana Election Results 2023 Live : తెలంగాణలో పుంజుకున్న బీజేపీ - ముఖ్యనేతలు మాత్రం వెనుకంజలోనే

Kamareddy Election Result 2023 Live : కామారెడ్డి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన వెంకట రమణారెడ్డి విజయం సాధించారు. 5,810 ఓట్ల తేడాతో విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థికి 65,198 ఓట్లు రాగా ఓట్లు రాగా బీఆర్ఎస్​ అభ్యర్థి సీఎం కేసీఆర్​కు 59,388 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి 54,296 ఓట్లు వచ్చాయి. మొత్తంగా 5,810 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణారెడ్డి విజయం సాధించారు. కౌంటింగ్ ప్రారంభం నుంచి ఆధిత్యం ఆద్యంతం చేతులు మారుతూ వచ్చినా చివరకు రమణారెడ్డిని విజయం వరించింది.

BJP Won Kamareddy Constituency : కామారెడ్డి నియోజకవర్గ కౌంటింగ్ అభ్యంతం ఆసక్తిని కలిగించింది. ప్రముఖులు పోటీ చేయడం ఒక ఎత్తు అయితే రౌండ్ రౌండ్​కు ఆధిక్యం చేతులు మారడంతో ఉత్కంఠను రేపింది. కౌంటింగ్ ప్రారంభంలో మొదటి మూడు రౌండ్లలో కాంగ్రెస్ ఆధిక్యం కనబరచగా... 5, 6, 9, 16 రౌండ్లలో బీఆర్ఎస్​ అధిక్యతను కనబరిచింది. మిగిలిన 11 రౌండ్లలో బీజేపీ స్పష్టమైన మెజార్టీని సాధించింది. నియోజకవర్గంలో మాచారెడ్డి దోమకొండ బీబీపేట కామారెడ్డి పట్టణం కామారెడ్డి గ్రామీణం మండలాలు ఉన్నాయి.

కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత బీఆర్ఎస్​, కాంగ్రెస్​లతో సమానంగా ఓట్లు సాధిస్తూ వచ్చిన రమణారెడ్డి భిక్కనూరు కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత క్రమంగా ఆధిక్యతను పెంచుకుంటూ వచ్చారు. కామారెడ్డి పట్టణంలో కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత స్పష్టమైన ఆధిక్యతను చూపించారు. ప్రతి రౌండ్​కు ఆధిక్యం పెంచుకుంటూ వెళ్లిన రమణారెడ్డి చివరికి ఉత్కంఠ భరితమైన పోరులో విజయం సాధించారు.

Hyderabad Telangana Election Result 2023 LIVE : గోషామహల్‌లో రాజాసింగ్ హ్యాట్రిక్ - రాజధానిలో బీజేపీ బోణీ

ఉమ్మడి రాష్ట్రంలో 2007లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిషత్ ఛైర్మన్​గా పని చేశారు. 2014 తర్వాత కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన రమణా రెడ్డి కామారెడ్డి నియోజకవర్గంలో వివిధ అంశాలపై పోరాటం చేశారు. మహిళలకు వడ్డీలేని రుణాలు విడుదల చేయాలంటూ కలెక్టరేట్ వద్ద ఆమరణ దీక్ష 48గంటల పాటు చేయగా పోలీసులు భగ్నం చేశారు.

ధరణి సమస్యలపై రైతుల పక్షాన పోరాటం చేసిన రమణ రెడ్డి బీఆర్ఎస్​ నాయకులు అక్రమంగా భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆందోళన చేశారు. కామారెడ్డి పట్టణంలో బీఆర్ఎస్​ నాయకులు అక్రమ వెంచర్లు చేసి ప్రజలను మోసం చేస్తున్నారంటూ రిలే దీక్షలు చేశారు. రైతుల నుంచి భూ సమస్యలపై వినతులు తీసుకున్నాడు. కామారెడ్డి పట్టణము కామారెడ్డి చుట్టుపక్కల ఉన్న మాస్టర్ ప్లాన్ బాధిత గ్రామాలు ఏకపక్షంగా రమణారెడ్డికి మద్దతు ప్రకటించి ఓట్లు వేయడంతో విజయం సాధించారు.

Telangana Assembly Election Results 2023 live News : అనుకున్నదే జరిగింది - కొడంగల్​లో రేవంత్, గజ్వేల్​లో కేసీఆర్ గెలుపు

Kishan Reddy To Kamareddy : వెంకటరమణరెడ్డిని గెలిపిస్తే కామారెడ్డి వస్తానన్న కిషన్​రెడ్డి మాట నిలబెట్టుకునేందుకు అక్కడకు బయలుదేరనున్నారు. కామారెడ్డి ప్రజలకు చెప్పినట్టుగానే విజయోత్సవ ర్యాలీలో పాల్గొనెందుకు కిషన్​ రెడ్డి కామారెడ్డికి వెళ్లనున్నారు.

అంధవిశ్వాసాలను నమ్మే సీఎం మనకు అవసరమా - తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాబోతుంది : ప్రధాని మోదీ

కొన ఊపిరి వరకు కొడంగలే శ్వాసగా జీవిస్తా- ఎన్నికల విజయంపై రేవంత్ ట్వీట్

Last Updated : Dec 3, 2023, 6:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.