ETV Bharat / state

బస్తీమే సవాల్​: కామారెడ్డి పీఠం కారుకు దక్కేనా... కాంగ్రెస్​కు చిక్కేనా...?

వరుస విజయాలతో జోరు మీదున్న తెరాస... అన్ని ఎన్నికల్లో అధిక్యం సాధిస్తున్న కాంగ్రెస్​... ఇద్దరికీ గట్టి పోటీ ఇచ్చి సత్తా చాటాలనుకుంటున్న భాజపా.. కామారెడ్డి పురపోరు ఇప్పుడిదే ఉత్కంఠభరితంగా మారింది. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, కాంగ్రెస్ నేత షబ్బీర్అలీ.. తమ పార్టీల విజయం కోసం నువ్వానేనా అన్నట్టుగా... శ్రమిస్తూ... గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

KAMAREDDY MUNICIPAL ELECTIONS ROUNDUP
KAMAREDDY MUNICIPAL ELECTIONS ROUNDUP
author img

By

Published : Jan 20, 2020, 4:13 PM IST

కామారెడ్డి పుర పీఠంపై గెలుపు బావుటా ఎగుర వేసేందుకు తెరాస, కాంగ్రెస్ పార్టీలు నువ్వానేనా అన్నట్టు పోటీ పడుతున్నాయి. పట్టణంలో ద్విముఖ పోరు నెలకొనగా... గంప గోవర్దన్, షబ్బీర్ అలీ ముందుడి నడిపిస్తున్నారు.

విజయ పరంపర కొనసాగేనా...?

కామారెడ్డి పురపాలక సంస్థలో 49 వార్డులు ఉండగా... 85,168మంది ఓటర్లు ఉన్నారు. 2014లో జరిగిన పురపోరులో పీఠం కాంగ్రెస్​ దక్కించుకున్నా... అనంతరం జరిగిన వలసలతో తెరాస వశమైంది. సగం కాలం అధికారాన్ని దక్కించుకున్నా.. కేవలం 5 సీట్లు మాత్రమే గెలవడం తెరాసకు మింగుడు పడని విషయం. అంసెంబ్లీ ఎన్నికల్లోనూ తెరాస స్వల్ప మెజార్టీతో గెలవటం ఆ పార్టీ శ్రేణుల్లో గుబులు రేపుతోంది. వరుసగా షబ్బీర్​ అలీపై విజయం సాధిస్తున్న గంప గోవర్దన్​... ఈసారి కామారెడ్డి పీఠాన్ని ఒంటరిగానే సొంతం చేసుకోవాలని​ శ్రమిస్తున్నారు.

ఆధిక్యం అధికారమిచ్చేనా...?

అన్ని ఎన్నికల్లోనూ పట్టణంలో హస్తానికి ఆధిక్యం లభించింది. అన్ని విషయాల్లో అధికార పార్టీకి కాంగ్రెస్​ గట్టి పోటీనిస్తూ వస్తోంది. వీటితోపాటు మైనార్టీ ఏరియాల్లో మంచి పట్టు ఉండటం కూడా కాంగ్రెస్​కు బలంగా భావిస్తున్నారు నేతలు. కామారెడ్డి పీఠం చేజిక్కించుకుని అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని షబ్బీర్​ అలీ భావిస్తున్నారు.

ఇక కాంగ్రెస్, తెరాసలకు తమ సత్తా ఏంటో చూపించాలని భాజపా భావిస్తోంది. కేంద్ర పథకాలను చూపి ఎన్నికల్లో విజయం సాధించాలని భావిస్తోంది. త్రిముఖ పోరుతో కామారెడ్డిలో రాజకీయ వేడి రాజుకుంది.

బస్తీమే సవాల్: కాలం మారింది..సెల్​ఫోన్​తో ఇస్మార్ట్ ప్రచారం..

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.