ETV Bharat / state

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు కోసం.. కొనసాగుతున్న నిరసనలు - Farmers gave petitions to municipal councillors

Kamareddy Master Plan Issue Updates: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు కోసం అన్నదాతలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే రైతులు మున్సిపల్ కౌన్సిలర్​లకు.. వినతి పత్రాలు ఇచ్చారు. పట్టణ బృహత్‌ ప్రణాళిక ముసాయిదా రద్దు కోసం మున్సిపల్ కౌన్సిల్​లో తీర్మానం చేయాలని అన్నదాతలు వారిని కోరారు.

Kamareddy Master Plan Issue
Kamareddy Master Plan Issue
author img

By

Published : Jan 9, 2023, 1:25 PM IST

Kamareddy Master Plan Issue Updates: కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్ రద్దు కోసం రైతుల నిరసన కార్యక్రమం కొనసాగుతోంది. ఆందోళనలో భాగంగా రైతు ఐక్యకార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు కామారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్​లకు వినతి పత్రాలు అందించే కార్యక్రమం చేపట్టారు.

మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్​లకు వినతిపత్రాలు ఇచ్చారు. ఇందులో భాగంగానే పార్టీలకు అతీతంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్​ఎస్ కౌన్సిలర్​లకు వినతి పత్రాలను కమిటీ సభ్యులు అందించారు. పట్టణ బృహత్‌ ప్రణాళిక ముసాయిదా రద్దు చేస్తూ కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్‌లో.. రైతులకు అనుకూలంగా తీర్మానం చేయాలని విన్నవించారు. మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్‌లో భూములు పోవని భరోసా ఇచ్చిన మున్సిపల్ పాలక వర్గ సభ్యులు.. అన్నదాతలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.