కామారెడ్డి జిల్లా ప్రాంతీయ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ శరత్... పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు.
ఆస్పత్రిలోని వసతుల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బంది సమయానికి వస్తున్నారో లేదో ఆరా తీశారు. ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే స్పందించేందుకు వీలుగా ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. ఆస్పత్రి ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.