ఆపరేషన్ స్మైల్ నిర్వహణలో ఏ ఒక్క బాలుడు, బాలిక అనాథగా ఉండొద్దని అందుకు గాను గ్రామ స్థాయి నుంచి చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ అన్నారు. ఐసీడీఎస్, విద్యాశాఖ, విద్యాశాఖ, ఎస్పీ, ఇతర అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
పోలీసులు జిల్లాలోని అనాథ బాలల వివరాలు సేకరించాలని సూచించారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో, దాబా, హోటళ్లు, ఇటుక బట్టీల వద్ద వుండే అనాథలను, బాలకార్మికులను గుర్తించి వారికి విద్య, వైద్య, వసతి, తదితర పునరావస ఏర్పాట్లు అందించాలని అధికారులను ఆదేశించారు. ఏ ఒక్కరూ కూడా అనాథలుగా ఉండొద్దనే భావాన్ని క్షేత్రస్థాయిలో అమలుపరచాలని సూచించారు.
ఇదీ చదవండి: రైతులకు మద్దతుగా జనవరి 9న ధర్నా: భట్టి విక్రమార్క