కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి, లింగంపేట మండలాల్లోని తహసీల్దార్ కార్యాలయాలను జిల్లా పాలనాధికారి శరత్ సందర్శించారు. రిజిస్ట్రేషన్లు పూర్తిచేసుకున్న రైతులకు పట్టా పుస్తకాలను, నకళ్లను అందజేశారు. ఆన్లైన్ ద్వారా స్లాట్ పూర్తి చేసుకున్న రైతులకు తహసీల్దార్ కార్యాలయంలో 20 నిమిషాల సమయంలో మార్పులు చేర్పులు చేసి పట్టా పుస్తకాలను, నకళ్లను అందజేస్తున్నామన్నారు.
జిల్లాలో ఇప్పటివరకు 701 రిజిస్ట్రేషన్లను పూర్తి చేశామని పేర్కొన్నారు. ధరణి పోర్టల్ విధానంపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఆయనతో పాటు అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఆర్డీవో శ్రీను నాయక్, ఎమ్మార్వో స్వామి, నారాయణ సిబ్బంది, తదితరులు ఉన్నారు.
ఇవీ చూడండి: కొనుగోళ్లలో గందరగోళం.. దిక్కుతోచని స్థితిలో పత్తి రైతు