కామారెడ్డి జిల్లాలోని కేజీబీవీ పాఠశాలను.. కలెక్టర్ శరత్ సందర్శించారు. కొవిడ్ బారిన పడ్డ 32 మంది విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని.. వైద్యులనడిగి తెలుసుకున్నారు. పాఠశాల ఎస్.ఓ లావణ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు.. ప్రభుత్వం టీకా పంపిణీ చేస్తూ నివారణకు కృషి చేస్తుంటే.. నిర్లక్ష్యంగా ఎలా ఉంటారని నిలదీశారు.
ఇంటికి వెళ్లి వచ్చిన విద్యార్థులను ఐసోలేషన్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. ఎవరు భయపడవద్దని వారికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో.. జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, ఆర్డీఓ శ్రీను, తహసీల్దార్ ప్రేమ్ కుమార్, మెడికల్ ఆఫీసర్ సుస్మిత రాయ్, కౌన్సిలర్ శంకర్ రావు, తదితరులు ఉన్నారు.
ఇదీ చదవండి: రయ్‌రయ్‌మంటూ బండితో రోడ్లపై దూసుకెళ్తున్న మైనర్లు