ETV Bharat / state

కలెక్టర్​ పర్యటన... అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం - banswada constituency news

కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని పలు మండలాల్లో కలెక్టర్ శరత్ పర్యటించారు. మొక్కల సంరక్షణ పట్ల నిర్లక్ష్యం వహించిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు అధికారులకు ఛార్జిమెమో జారీ చేశారు.

kamareddy collector sharath fire on officers for negligence

author img

By

Published : Dec 2, 2020, 9:18 PM IST

మొక్కల సంరక్షణ పట్ల నిర్లక్ష్యం వహించిన అధికారులపై కామారెడ్డి జిల్లా కలెక్టర్​ శరత్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాన్సువాడ నియోజకవర్గంలోని పలు మండలాల్లో కలెక్టర్ పర్యటించారు. బాన్సువాడ తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ధరణీ పోర్టల్ పనితీరును అడిగి తెలుసుకున్నారు. పోర్టల్ ద్వారా నమోదు చేసుకున్న లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేశారు.

బీర్కూర్ మండలంలోని ప్రధాన రహదారి వెంట హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలను పరిశీలించారు. అనంతరం బీర్కూర్ తహసీల్దార్ కార్యాలయంలో పల్లెప్రగతిపై సమీక్ష నిర్వహించారు. మొక్కల సంరక్షణపై నిర్లక్ష్యం వహించినందుకు బీర్కూర్ ఎంపీవో అనిత, పంచాయతీ కార్యదర్శి యోగేశ్​లకు ఛార్జిమెమో జారీ చేశారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్... ఎంపీడీవో పంచాయతీ కార్యదర్శిపై పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ చంద్రమోహన్ రెడ్డి, తహసీల్దార్ గణేశ్​, ఎంపీడీవో భోజరావు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: మొక్కజొన్న కొనుగోలు చేయాలంటూ సెల్​టవర్​ ఎక్కిన రైతులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.