ETV Bharat / state

'ప్రైమరీ కాంటాక్ట్స్​ పరీక్షలపై దృష్టి పెట్టండి'

రాష్ట్రంలో రెండో దశ కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజువారీ కేసులు కూడా భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కామారెడ్డి కలెక్టర్​.. జిల్లాలోని పీహెచ్​సీ, సీహెచ్​సీ కేంద్రాల వైద్యాధికారులతో ​సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

covid in Kamareddy
కామరెడ్డి కలెక్టరేట్​
author img

By

Published : Apr 11, 2021, 6:57 PM IST

కామారెడ్డి కలెక్టర్ శరత్.. సెల్ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని పీహెచ్​సీ, సీహెచ్​సీ కేంద్రాల వైద్యాధికారులతో సమీక్షించారు. కొవిడ్ రెండో దశ నేపథ్యంలో తీసుకోవాల్సిన పలు జాగ్రత్తల గురించి వారితో చర్చించారు. ప్రైమరీ కాంటాక్ట్స్ పరీక్షలను అధిక శాతం నిర్వహించాలని సూచించారు.

కేంద్రాల వారీగా.. 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి.. వాక్సిన్​ అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ అధికారులను ఆదేశించారు. వ్యాక్సినేషన్ పాయింట్లను పెంచి.. రోజు వారి టార్గెట్​ను సాధించాలని సూచించారు. చెక్ పోస్టుల వద్ద ఎక్కువ పరీక్షలు నిర్వహించాల్సిందిగా కోరారు.

ఇదీ చదవండి: ఉపఎన్నిక వేళ... వెక్కిరిస్తోన్న సమస్యల మేళా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.