బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయమని కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ అన్నారు. జగ్జీవన్ రామ్ 133వ జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ప్రజలంతా సమానత్వంతో జీవించేందుకు అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప యోధుడు జగ్జీవన్ రామ్ అని కలెక్టర్ శరత్ కుమార్ అన్నారు. ప్రజల సంక్షేమం కోసం నిర్వహిస్తున్న పథకాల ఫలాలు వారికి అందినప్పుడే ఆయన కల సాకారం అవుతుందని తెలిపారు. మహనీయులు లక్ష్యాల సాధన కోసం మనమంతా పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి మున్సిపల్ ఛైర్మన్ నిట్టు జాహ్నవి, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: పోలీసు యంత్రాంగం అప్రమత్తం .. సరిద్దుల్లో తనిఖీలు ముమ్మరం