ETV Bharat / state

'వామన్​రావు దంపతుల హత్యకేసును సీబీఐకి అప్పగించాలి'

author img

By

Published : Mar 1, 2021, 7:19 PM IST

న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని కామారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వామన్​రావు దంపతుల హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని డిమాండ్​ చేస్తూ.. జిల్లా కోర్టు వద్ద మూడురోజుల రిలే నిరాహార దీక్షను ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లాలోనూ లాయర్లు ఆందోళన చేపట్టారు. న్యాయవాదులకు రక్షణలేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.

kamareddy-bar-association-demands-handing-over-of-vaman-rao-couple-murder-case-to-cbi
'వామన్​రావు దంపతుల హత్యకేసును సీబీఐకి అప్పగించాలి'

న్యాయవాది వామన్​రావు దంపతుల హత్యకేసు నిందితులపై చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కామారెడ్డి బార్ అసోసియేషన్​ విమర్శించింది. ఆ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని డిమాండ్​ చేస్తూ.. జిల్లా కేంద్రంలోని కోర్టు వద్ద మూడురోజుల రిలే నిరాహార దీక్షను న్యాయవాదులు ప్రారంభించారు.

న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని బార్ అసోసియేషన్ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వామన్​రావు కుటుంబానికి రూ. 5 కోట్ల నష్టపరిహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మణ్ రావు, సెక్రటరీ సురేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు శ్రీధర్, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

రంగారెడ్డి జిల్లాలో...

వామన్​రావు కుటుంబానికి న్యాయంచేయాలని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బార్​ ఆసోసియేషన్​ ఆధ్వర్యంలో రిలేనిరాహార దీక్ష చేపట్టారు. రాష్ట్రంలో న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: పామును చంపి యజమానిని కాపాడిన శునకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.