కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం సురాయిపల్లి గ్రామంలో సోమవారం.. జూనియర్ లైన్ మెన్ని గ్రామస్థులు.. గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు. పోతాయిపల్లి ఉమ్మడి గ్రామపంచాయతీకి సంబంధించిన జూనియర్ లైన్మెెన్ పోశెట్టి తన విధులు నిర్వహించకుండా ఐలాపూర్ సబ్ స్టేషన్లో ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడని గ్రామస్థులు తెలిపారు.
ఉమ్మడి గ్రామపంచాయతీ పరిధిలో ఏవైనా కరెంటు సమస్యలు ఉన్నా, ఇతర సమస్యలు ఉన్నా ఆ లైన్మెన్ అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అతనిని పూర్తిస్థాయిలో పంచాయతీ పరిధిలోనే ఉంచాలని అధికారులకు విన్నవించారు.
ఇదీ చదవండి: కార్పొరేటర్ భర్త వీరంగం.. అనుచరులతో కలిసి దాడికి యత్నం