కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం హండేకేలూర్ గ్రామంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. బాన్సువాడ డీఎస్పీ యాదగిరి ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయి. తెల్లవారు జాము నుంచే ఇంటింటికీ వెళ్లి పరిసరాలను గాలించారు. సరైన ధ్రువపత్రాలు లేని 72 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇవీ చూడండి: స్థానిక సంస్థల ఎన్నికలకు ఈసీ పచ్చజెండా