కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సలాబత్ పూర్ సరిహద్దు తనిఖీ కేంద్రం వద్ద వివిధ శాఖల అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారి పూర్తి వివరాలు తెలుసుకుని దస్త్రాల్లో నమోదు చేసుకుంటున్నారు. వారు ఎక్కడి నుంచి వస్తున్నారు..? ఎక్కడికి వెళ్లాలి..? అనే ప్రశ్నలు వేస్తున్నారు.
వారి చరవాణి నెంబర్లను నమోదు చేసుకుంటున్నారు. సరిహద్దు మీదుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారి పూర్తి వివరాలు కూడా అడిగి తెలుసుకుంటున్నారు. వైద్య పరీక్షలతో పాటు సరిహద్దు మీదుగా వెళ్లే వలస కూలీల చేతులకు క్వారంటైన్ ముద్రలు వేసి పంపిస్తున్నారు.
ఇవీ చూడండి: క్షేత్రస్థాయిలో నిఘా: ఆ సడలింపులు ఇద్దామా? వద్దా?