కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో రోగనిరోధక శక్తిని పెంచే హోమియోపతి మందుల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా కిట్ల పంపిణీని ప్రారంభిస్తూ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, బీబీ పాటిల్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం అందరికీ భౌతిక దూరం పాటిస్తూ రోగ నిరోధక శక్తిని పెంపొందించే కిట్లను పంపిణీ చేశారు.
జిల్లాలోని 70 వేల ఇళ్లలోని 14 లక్షల కుటుంబాలకు ఈ హోమియోపతి మందుల పంపిణీ జరుగుతుందని ఎమ్మెల్యే గంప తెలిపారు. ప్రతి ఒక్కరూ కరోనా కట్టడి చర్యలు పాటిస్తూ అత్యవసర పరిస్థితుల్లోనే ఇళ్లలోంచి బయటకు రావాలని సూచించారు. బయటకు వస్తే శానిటైజర్ వాడుతూ, మాస్కులు ధరించాలని ప్రజలను కోరారు.
ఇదీ చూడండి : రాష్ట్రంలో 42 వేలు దాటిన కరోనా కేసులు.. 400పైగా మరణాలు