కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాల్ పరిధిలో హోమియో కేర్ ఇంటర్నేషనల్ ఇమ్యూనిటీ బూస్టర్ కిట్లను జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు బీబీపాటిల్ ఉచితంగా తన స్వంత ఖర్చులతో పంపిణీ చేస్తున్నారు. కాగా రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఈ కిట్లను ఎల్లారెడ్డి మండల గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలకు స్థానిక ఎమ్మెల్యే సురేందర్ అందజేశారు.
ఎల్లారెడ్డిలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని ఎమ్మెల్యే సురేందర్ ఆందోళన వ్యక్తం చేశారు. కావున ప్రతీ ఒక్కరు ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలంటే మాస్కులు ధరించి.. భౌతిక దూరాన్ని పాటించాలని.. రోగనిరోధక శక్తిని పెంపొందించే ఆహారం, కషాయం తీసుకోవాలని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: గేటెడ్ కమ్యూనిటీల్లో కరోనా చికిత్స