కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం జలాశయం అలుగు పారుతోంది. మంచిప్ప, గాంధారి అటవీ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు లింగంపేట పెద్దవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తూ 5,973 క్యూసెక్కుల వరద నీరు పోచారం జలాశయంలోకి వచ్చి చేరుతుంది.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,464 అడుగులకు చేరుకొని గేట్లపై నుంచి వరద నీరు దిగువకు వెళ్తోంది. ప్రస్తుతం పూర్తి స్థాయి నీటినిల్వ 1.820 టీఎంసీలుగా ఉంది. అలుగు పారుతుండడం ద్వారా 5933 క్యూసెక్కుల నీళ్లు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వెళ్తోంది. సింగూరు ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తడం ద్వారా లింగాల గ్రామం వద్ద మంజీరా కాల్వకు వదర ప్రవాహం అధికంగా ఉంది.
ఇదీ చూడండి: అనాజ్‌పూర్, యూకే గూడ మధ్య రోడ్డుపై ప్రవహిస్తున్న నీరు