ETV Bharat / state

సౌదీలో గుండెపోటు... కామారెడ్డి జిల్లాలో విషాదం

అప్పులు తీర్చేందుకు గల్ఫ్​ బాట పడుతున్నారు. అప్పులు తీరుతాయో లేదో అనే బెంగతో గుండెపోటుకు గురవుతున్నారు. ఇలాంటి సంఘటన కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం క్యాసంపల్లి తండాలో చోటు చేసుకుంది.

heart attack in Saudi  tragedy in kamareddy district
సౌదీలో గుండెపోటు... కామారెడ్డి జిల్లాలో విషాదం
author img

By

Published : Apr 12, 2020, 5:59 PM IST

కామారెడ్డి జిల్లా ఫరిధిలోని క్యాసంపల్లికి చెందిన సేవ్య సౌదీ అరేబియాలో గుండెపోటుతో మృతి చెందాడు. సేవ్య-లలిత దంపతులకు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒక కుమార్తె మానసిక వికలాంగురాలు. సేవ్య తనకున్న వ్యవసాయ భూమిలో పంట పండించుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. కాలం కలిసి రాక సుమారు ఆరు లక్షల అప్పైంది. అప్పులు తీర్చేందుకు సౌదీకి వెళ్లి అక్కడ డ్రైవర్​గా పనిలో చేరాడు.

ప్రతి రెండేళ్లకు ఓసారి స్వగ్రామానికి వస్తూ పోయేవాడు. శనివారం ఉదయం సౌదీ నుంచి సేవ్య భార్యకు ఫోన్​చేసి మాట్లాడాడు. రెండు గంటల తర్వాత సేవ్య గుండెపోటుతో మరణించినట్లు సౌదీ నుంచి మరో కాల్​ వచ్చింది. సేవ్య మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్​లు స్పందించి లాక్​డౌన్ పూర్తైన తర్వాత సేవ్య మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని బంధువులు కోరారు.

సౌదీలో గుండెపోటు... కామారెడ్డి జిల్లాలో విషాదం

ఇదీ చూడండి : ఒక్కరోజే 11 కేసులు.. అధికార యంత్రాంగం అప్రమత్తం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.