కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సిర్పూర్లో మొక్క జొన్న, వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ కిష్టానాయక్ ప్రారంభించారు. మొక్క జొన్న క్వింటాకు రూ.1760, వరిధాన్యం ఏ గ్రేడ్ క్వింటాకు రూ.1835, బీ గ్రేడ్ రూ.1815 గా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
కరోనా వైరస్ కట్టడికి లాక్డౌన్ అమలు చేస్తున్నందున రైతులు పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తహసీల్దార్ కిష్టా నాయక్ తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు, సిబ్బంది భౌతిక దూరం పాటించాలని సూచించారు.