కామారెడ్డి పట్టణంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్.. కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక మత్స్యకారుల అభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని అన్నారు. వంద శాతం సబ్సిడీతో చేప,రొయ్య పిల్లలను అందిస్తోందని తెలిపారు.
నియోజకవర్గంలోని 261 మంది లబ్ధిదారులకు 2కోట్ల 61లక్షల రూపాయల కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. సమీకృత మత్స్య అభివృద్ధి పథకంలో భాగంగా 100 శాతం సబ్సిడీతో 64వేల రొయ్య పిల్లలను కామారెడ్డి పెద్ద చెరువులో వదిలారు.
గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా మత్స్య కారులను ఆదుకోవాలని ఏమాత్రం ఆలోచన చేయలేదు. తెలంగాణ ప్రభుత్వం.. మత్స్య కారుల అభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. 100 శాతం సబ్సిడీతో చేప, రొయ్య పిల్లలను పంపిణీ చేస్తోంది. అమ్ముకోవడానికి వాహనాలు ఇస్తోంది. పథకాలు సద్వినియోగం చేసుకుని మత్స్య కారులు ఆర్థికంగా ఎదగాలి.
- గంప గోవర్ధన్, ప్రభుత్వ విప్