మృతదేహాలపై ఉండే విలువైన వస్తువుల కోసం రాత్రి సమయాల్లో కొందరు వ్యక్తులు దారుణాలకు పాల్పడుతున్నారు. శవాలు కాలుతుండగానే వాటిని తొలగిస్తూ ఆభరణాలను కాజేస్తున్నారు. పూడ్చిన శవాలనూ బయటకు తీసి ఆభరణాలను దోచుకెళ్తున్నారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా దేవునిపల్లి శ్మశాన వాటికలో చోటుచేసుకుంది.
ఆదివారం రాత్రి ఓ శవాన్ని పక్కకు తొలగించి వస్తువులను దొంగిలిస్తుండగా.. గ్రామస్థులు పట్టుకున్నారు. నాలుగు రోజుల క్రితం నుంచి ఇలాగే జరుగుతుండటంతో.. వారిని పట్టుకుని ఆరా తీశారు. వస్తువుల కోసం వచ్చినట్లు వారు ఒప్పుకోవడంతో...పోలీసులకు సమాచారం అందించారు.
ఇవీచూడండి: ప్రైవేటు ఆస్పత్రిలో కరోనా మృతురాలి వజ్రాల నగలు మాయం